రాజధానిలో 74మంది యువతి,యువకుల అరెస్ట్‌

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న టానిక్‌పబ్‌పై పోలిసులు తెల్లవారి జామున 5గంటల ప్రాంతంలో దాడిచేశారు. 74మంది యువతి యువకులను అరెస్ట్‌ చేశారు. పబ్‌ను సీజ్‌ చేశారు. నిబందనల ప్రకారం రాత్రి 12గంటల వరకు మాత్రమే పబ్‌ నడపాలి నిబందనలను గాలీకి వదిలేసి ఉదయం వరకు నడుస్తూనే ఉంది ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు ఇందలో 14మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. వీరిలో ప్రముఖుల తనయులు కూడా ఉన్నట్లు సమాచారం. వారి తల్లీదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇప్పిస్తామని పోలిసులు తెలిపారు.