రాజవరం మేజర్ పంట కాల్వలను పరిశీలించిన ఎన్ఎస్పి అధికారులు, ఎంపీపీ
తిరుమలగిరి (సాగర్) సెప్టెంబరు 29 (జనంసాక్షి): మండల ఇరిగేషన్ డివిజన్ 2 ఎన్ ఎస్ పి ఈ ఈ కరుణాకర్, తిరుమలగిరి సాగర్ మండల పరిషత్ అధ్యక్షుడు భగవాన్ నాయక్ లు రాజవరం మేజర్ ఇరిగేషన్ డివిజన్ 2 పరిధిలోని కాలువలను పరిశీలించారు. కాలువలోని నాచును, మరియు ఏమైనా రిపేర్లు ఉంటే చేయించి కాలువలకు సంబంధించి గండ్లు,మరమ్మతులు చేయించుటకు ముందు జాగ్రత్త గా పరిశీలించారు. కాలువల సమస్యలను, నీరు అందక చివరి ఆయకట్టు రైతులు పడుతున్న కష్టాలను మండల పరిషత్ అధ్యక్షుడు భగవాన్ నాయక్ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ కాలువలలో నాచు తొలగించి ఆయకట్టు చివరి భూముల వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డిఇ సీతారాం, ఇరిగేషన్ సబ్ డివిజన్ 1 ఏఈఈ.వేణుగోపాల్, శ్రవణ్ కుమార్, రవి, వర్క్ ఇన్స్పెక్టర్ సిరుపుద్దీన్ ఫీల్డ్ స్టాప్ రైతులు బుర్రి రామిరెడ్డి పాల్గొన్నారు.