రామడుగులో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: జిల్లాలోని  రామడుగు మండల కేంద్రంలో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.  దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం బస్సులో నుండి దిగి వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. రామడుగు ఎస్సై వెంకటస్వామి  అక్కడకి చేరుకుని నిరసన కారులను చెదరగొట్టాడు అనంతరం వాహనాలు కదిలాయి.