రాయలసీమలో రైల్వే కోచ్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలి

రైల్వే శాఖ సహాయ మంత్రిని కోరిన సీఎం

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లాలోని కాజీపేటలో రైల్వే వ్యాగన్ల పరిశ్రమను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని కోరారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య కొత్త రైలు ప్రారంభ కార్యక్రమంలో సీఎం, రైల్వే శాఖ సహాయ మంత్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడారు. రాయలసీమలో రైల్వే కోచ్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.