రాయల తెలంగాణకు తెదేపా ఫొరం వ్యతిరేకం:ఎర్రబెల్లి

వరంగల్‌:రాయల తెలంగాణకు తెదేపా తెలంగాణ ఫొరం పూర్తి వ్యతిరేకమని ఫొరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన వస్తే కలిస్తి పార్టీలతో ఉద్యమిస్తామన్నారు.హైదరాబాద్‌లేని తెలంగాణను అంగీకరించమన్నారు.రాజకీయ లబ్ది కోసమే రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ నాటకమాడుతోందన్నారు.రాయల తెలంగాణ అంశంపై తక్షణమే కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.