రాష్ట్రంలో కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: రాష్ట్రంలో బలహీన అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్ర తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళినాడు వరకు  కొనసాగనుందని వెల్లడించింది. ఇది క్రమంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల  కారణంగా క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడ్డాయని, వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేశారు.