రాష్ట్రంలో బలహీన పడిన ద్రోణి

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురిపిసు&ఓతన్న అల్పపీడన ద్రోణి చత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లింది. ద్రోణి బలహీనపడటంతో సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు తగ్గుతాయని వాతావరణ కేంద్రం సంచాలకుడు సుధాకర్‌ చెప్పారు. జూన్‌ నుంచి రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ఉన్నప్పటికీ ఈనెల 12నుంచి బాగా బలపడింది. అందువల్లే గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. మళ్లీ ఈ నెల 26వ తేదీ నాటికి ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని సుధాకర్‌ చెప్పారు. ఈ నెల చివరి వారంలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.