రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు వ్యవసాయశాఖ కమిషనర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎలాంటి విత్తనాల కొరత లేదని వ్యవయసాయశాఖ కమిషనర్‌ మదుసూదనరావు అన్నారు.మహికో బీటీ పత్తి విత్తనాల కోసం రైతుతు పోటీ పడవద్దని  సూచించారు.మహికోకు ప్రత్యామ్నాయంగా 54కంపెనీల వంద రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.శుక్రవారం కర్నూలు తూర్పుగోదావరి,ఖమ్మం వరంగల్‌ జిలాలొ దాడులు జరిపి 12కేసులు చేశామన్నారు.ఎక్కడైనా నాసిరకం విత్తనాలు ఉన్నట్లు తెలిస్తే అధికారులకు తెలపాలని చెప్పారు.హైదరాబాద్‌ మానిటరింగ్‌ సెల్‌ నెంబరు 040-23383509కు ఫిర్యాదు తెలుపాలని ఆమన చెప్పారు.