రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయి: స్వర్ణలత భవిష్యవాణి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రెండో రోజు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి అమ్మవారి ఆలయం నుంచి వస్త్రాలు తీసుకెళ్లి భవిష్యవాణి వినిపించే స్వర్ణలత అనే భక్తురాలికి అందించారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురుస్తాయని, పాడి పంటలకు లోటు ఉండదని కాని ధరలు పెరుగదల ఉంటుందని భవిష్యవాణి తెలిపింది. ఆలయంలో తనకు సరైన పూజలు అందడంలేదని అమ్మవారి వాక్కుగా పలికింది. గత ఏడాది భక్తులు మహాకాళేశ్వరస్వామి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.