రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో లోపాలను ఎత్తిచూపిన టీజీవోలు

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో జరుగుతున్న లోపాలను, జీవోలను అన్వయించడంలో జరుగుతున్న అవకతవకలను తెలంగాణ గెజిటెడ్‌ అధికారులు సంఘం ఎత్తిచూపింది. ఈ మేరకు శుక్రవారం సంఘం ప్రతినిధులు జస్టిస్‌ రాయకోటె కమిషన్‌కు వాటిని విన్నవించింది. సంఘం ప్రతినిధులు రాష్ట్రపత ఉత్తర్వుల అమలుపై ఏర్పాటైన ఈ కమిషన్‌కు జీవో నంబర్‌ 674 అమలులో జరిగిన అవకతవకలు వివరించారు. నగర పోలసు విభాగంలోను, స్థానిక సంస్థల్లోను, తహశీల్దార్లు, జూనియర్‌ ఇంజినీర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిందని, ఇప్పటికైనా ఈ లోపాలను, అవకతవకలను సవరించాలని వారు కమిషన్‌ను కోరారు.