రాష్ట్రపతి ఎన్నికకు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు

హైదరాబాద్‌: ఈనెల 19న రాష్ట్రపతి పదవికి ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి వీలుగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటో కమిటీ హాలులో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్‌ గురువారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతోంది. పోలింగ్‌ పూర్తికాగానే బ్యాలెట్‌ బాక్సులను ఢిల్లీకి పంపుతారు. ఈనెల 21న అక్కడే ఒట్ల లెక్కింపు ఉంటుంది.