రాష్ట్రపతి విదేశి పర్యటనల సమాచారాన్ని బహిర్గతం చేయలేం

న్యూఢిల్లీ: విదేశి పర్యటనలు, ఇతరత్రా ప్రయాణాల ఖరారు కోసం రాష్ట్రపతి ఇచ్చిన సమాచారాన్ని, ఈ పర్యనటల వివరాలను బహిర్గతం చేయలవలేమని విదేశాంగ శాఖ స్పష్పం చేసింది. తమ పర్యటనల కోసం రాష్ట్రపతి ప్రతిభాపాటెల్‌, మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌ కలాం ప్రభుత్వానికి ముందుస్తుగా ఇచ్చిన సమాచారాన్ని వెల్లడించాలని కోరుతూ కలాం ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు సహచట్టం కింద రాష్ట్రపతి సచివాలయంలో దరఖాస్తు చేశారు. రాష్ట్రపతి సచివాలయం ఈ దరఖాస్తు విదేశాంగ శాఖకు పంపించింది. స.హ కార్యకర్త కోరిన సమాచారం తమ వద్ద లేదని ప్రోటోకాల్‌ విభాగం వెల్లడించింది. ఆయన ఉన్నతాధికారులకు మరో దరఖాస్తు అందజేశారు. స.హ చట్టంలో సెక్షన్‌ 8(1) (ఎ) ప్రకారం విదేశాలతో సంబందాలను ప్రభావితం చేసే సమాచారాన్ని ఇవ్వడం సాధ్యం కాదని విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రపతి ఏయే దేశాల్లో ఎప్పుడెప్పుడు, ఎంత సమయం పర్యటించారు అనే సమాచారం ప్రయాణాల ఖరారు కోసం వారు వివరాలను బయటపెట్టాలేమి పేర్కొన్నారు.

తాజావార్తలు