రాష్ట్రపతి విదేశీ పర్యటనల సమాచారాన్ని బహిర్గతం చేయలేం

న్యూఢిల్లీ: విదేశీ పర్యలనలు, ఇతరత్రా ప్రయాణాల ఖరారు కోసం రాష్ట్రపతి ఇచ్చిన సమాచారాన్ని, ఈ పర్యటనల వివరాలను బహిర్గతం చేయలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రపతి సచివాలయం ఈ దరశాస్తును విదేశాంగ శాఖకు పంపించింది. ఆయన ఉన్నతాధికారులకు మరో దరఖాస్తు అందజేశారు. స.హ.చట్టంలోని సెక్షన్‌ 8(1) (ఎ) ప్రకారం విదేశాలతో సంబంధాలను ప్రభావితం చేసే సమాచారాన్ని ఇవ్వడం సాధ్యం కాదని విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రపతి ఏయే దేశాల్లో ఎప్పుడెప్పుడు, ఎంత సమయం పర్యటించారు అనే సమాచారం, ప్రయాణాల ఖరారు కోసం వారు ఇచ్చిన వివరాలను బయట పెట్టలేమని పేర్కొన్నారు.