రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల వివరాల విడుదల
హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను పోలీస్ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. గత సంవత్సరం అక్టోబరులో వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఎంపిక జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 14,358 మందిని ఎంపిక చేసినట్లు డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఎంపికకు సంబంధించిన వివరాలన్నింటినీ www.apstatepolice.org . వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన సమాచారం వచ్చేవరకూ వేచి ఉండాలని ఏమైనా సందేహాలుంటే 040- 23232266 నెంబరులో సంప్రదించాలని సూచించారు.