రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చందుకి స్వాగతం పలికిన నాయకులు

..ఆర్.కిషోర్,
..కురువ పల్లయ్య
.. రవి ప్రకాష్ గౌడ్
మానవపాడు, సెప్టెంబర్ 1 (జనం సాక్షి):
అలంపూర్ నియోజకవర్గం లో పర్యటనలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్ ని ఆర్.కిషోర్ కార్యాలయం నందు మర్యాదగాపూర్వకంగా పూల బొకే శాలువాతో సన్మానించి స్వాగతం పలకడం జరిగినది. అనంతరం అలంపూర్ చౌరస్తా లో ఉన్న మార్కెట్ యార్డ్ ను పరిశీలించడం జరిగినది.అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర
,జోగులాంబ దేవి ఆలయ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్.
అలంపూర్ నియోజకవర్గ ప్రజల చిరుకాల కోరికను కోరుతూ అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాలకు ఒక్కొక్క మండలానికి చొప్పున గిడ్డంగుల గోదాములను మంజూరు చేయాలని కోరడం జరిగినది, రైతులు పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి గోదాములలో సానుకూలంగా ఉంటుందని కోరారు._
దీనిపై రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చందు గారు సానుకూలంగా సంప్రదించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య,గుమ్మ గోవర్ధన్ ,హుస్సేన్, డేవిడ్ ,ఆనంద్ , మార్కెట్ యాడ్ కు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు._