రాష్ట్ర విభజన సున్నితమైన సమస్య : బొత్స

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన సున్నితమైన సమస్యని… దీనికి సత్వరమే పరిష్కారం చూపించాలని కేంద్రాన్ని కోరతామని పీసీసీ కోరతామని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స ప్రారంభోపన్యాసం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలకు దిశానిర్దేశం చేయడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పార్టీ పెట్టారని పరోక్షంగా జగన్‌పై విమర్శిలు గుప్పించారు. రాజకీయాలతో అధికార దుర్వినియోగం చేసి వ్యాపార లబ్ధి పొందారని ఆరోపించారు.