రాహుల్‌గాంధీని కలవనున్న సీమాంధ్ర నేతలు

ఢీల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కలవనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు రాహుల్‌గాంధీని కోరనున్నారు. మరో వైపు తెలంగాణ అంశంపై ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రానికి తిరుగుముఖం పట్టారు.