రుద్రూర్ లో విఠలేశ్వర మందిరం పునర్నిర్మాణ పూజ కార్యక్రమలు
రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండలం కేంద్రంలోని విఠలేశ్వర మందిరం పునర్నిర్మాణం లో బాగంగాబుధవారం రోజున ఉదయం 7 గంటలనుండి మొదటగా గణపతి గౌరీ పూజ మరియు పుణ్యవచనము రక్షాబంధన మరియు అఖండ దీపారాధన రుత్విక్ వర్ణన అంకురార్పణ శిఖరము బలిపీఠం పూజలతో పాటు నుతన దేవత విగ్రహాల ఊరేగింపు జరిపి అనంతరం జలధివాసం చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 2: 30 గంటల వరకు యాగశాలలో యజ్ఞాది కార్యక్రమలను శ్రీవిఠలేశ్వర మందిర ఆలయ పూజారి రామశర్మ కులకర్ణి మరియు భాను శర్మ ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమం జరిగినవి. ఆలయ యజ్ఞ విధులను నిష్ట ఆలయ కమిటీ అధ్యక్షులు చిదుర వీరేశం దంపతులు, ప్రధాన కార్యదర్శి గెంటిల సాయిలు దంపతులు, ఆలయ ఉపాధ్యక్షులు కరికే అశోక్ దంపతులు, బీఆర్ ఏస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ దంపతులు, రాష్ట్ర ఆర్టీఐ కార్యదర్శి తాటిపాముల రాజశేఖర్ దంపతులు , మోత్కూరి నారాయణ దంపతులు, నీరడి సంజీవ్ మొదలగు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు