రెండు లారీల ఢీ, పలువురికి గాయాలు

జోగిపేట (పట్టణం) : రెండు లారీల ఢీ కొని పలువురికి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి మెదక్‌ జిల్లా ఆంథోల్‌ పరిధిలోని కంసాలపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నారాయణ్‌ఖేడ్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఓ బ్రిడ్జి వద్ద ఢీ కొట్టి నిలిచిపోయింది. దీన్ని వెనుక వచ్చిన డీసీఎం ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారికి ఆసుపత్రికి తరలించారు.