రెండు వేల దీపం కనెక్షన్లల మంజూరు పత్రాల పంపిణీ
కమాన్‌పూర్: మండలానికి మంజూరైన రెండు వేల దీపం కనెక్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను బుధవారం రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు సత్తయ్య మాట్లాడుతూ లబ్ధిదారులు గ్యాస్ డీలర్ వద్ద రూ. 844 మాత్రమే చెల్లించి కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. ఈ సిలిండర్లను దుర్వినియోగం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.