అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు

జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 15తరిగొప్పుల మండల కేంద్రంలోని బోత్తలపర్రే గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాలి జాలం పూలమాల అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అమూల్యమైన సేవలు అందించారని, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. అలాంటి మహనీయుడిని స్మరించుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు మాలి జాలం, వీరన్న, నాను,ప్రవీణ్, మనోహర్ రాజన్న,రాజు,కరన్ సీంగ్ ,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు