రేపు కరీంనగర్ జిల్లాబంద్‌కు పిలుపునిచ్చిన తెదేపా
కరీంనగర్ : విద్యుత్తు కోతలపై ఎన్‌ఈ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన తెదేపా ఎమ్మెల్యేలను అరెస్టుచేసిన జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జల్లా బంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది. అరెస్టయిన ఎమ్మెల్యేలను తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండప వెంకటేశ్వరరావు, హన్మంత్‌షిండే తదితరులు జైలులో పరామర్శించారు.అనంతరం వారి అరెస్టును నిరసిస్తూ గురువారం ఎన్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు అనుమతిలేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకొని సొంతపూచీకత్తుపై విడుదలచేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తే పోలీసులు అణచివేయాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యుత్తు కోతలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు.