రేపు కూడా నరసరావుపేటలో 144 సెక్షన్‌

గుంటూరు : గుంటూరు జిల్లా నర్సరావు పేటలో రేపు కూడా 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసులు తెలియజేశారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ పాటించాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపునిచ్చింది. 144 సెక్షన్‌ దృష్ట్యా బంద్‌ పాటించవద్దని పోలీసులు వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.