రేపు ముగియనున్న ప్రజాపోరు యాత్ర

హన్మకొండ: తెలంగాణ ప్రక్రియ రోడ్‌ మ్యాప్‌ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేపట్టిన ప్రజాపోరు యాత్ర సోమవారంతో ముగియనుంది. దీని ముగింపు సభ వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదనంలో నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు రాష్ట్ర కార్యాదర్శి తదితరులు హాజరుకానున్నారు. ఈ సభకు తెరాసతోపాటు ఐకాస నేతలు ఇప్పటికే మద్దతు ప్రకటించారు.