రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి-హరీష్‌రావు
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కోతల్లో కూడా సీఎం కిరణ్ సర్కార్ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. కరెంటు కోతలపై త్వరలోనే ట్రాన్స్‌కోను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కోతలు ఎక్కువగా ఉన్నయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంద్రాలో మాత్రం తక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణ రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలాని డిమాండ్ చేశారు పెంచిన విద్యుత్ చార్జిలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2.80లకు కేంద్రం కరెంటు కొనాలని సూచిస్తే, రూ. 5.70లకు కరెంట్ కొనడం వెనుక సీఎం ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.