రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి దయలేదు: ఎర్రన్నాయుడు

విజయవాడ: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కరుణ, దయ లేదని, వైకాపా నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద జరిగిన మహాధర్నాలో ప్రసంగిస్తూ ఆయన పులిచింతల పేరిట కృష్ణా డెల్టా ప్రజలను వైఎస్‌ మోసం చేశారన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయకుండానే కాలువలు తవ్వించిన ఘనత వైఎస్‌దన్నారు. పోతిరెడ్డిపాడు పేరిట వైఎస్‌ పాపాలు కృష్ణా డెల్టాను వెంటాడుతున్నాయని ఆయన అన్నారు.