రైతు బజారును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉపలోకయుక్త జడ్జి

కరీంనగర్‌: కరీంనగర్‌ శనివారం అంగడి బజారులోని రైతు బజారును రాష్ట్ర ఉప లోకాయుక్త ఎంవీఎన్‌ కృష్ణాజీరావు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులు, ఉద్యోగుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు అటెండర్లు గైర్హాజరులో ఉన్నట్లు హాజరు పట్టికలో గుర్తించారు. పదో రీజియన్‌లో అభివృద్ది పనులు చేపట్టడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుకోవటం లేదని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు.