లంచం తీసుకున్నట్లు అంగీకరణ -న్యాయమూర్తి పట్టాభి

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి కేసులో ఆయనకు బెయిలు మంజూరుచేసేందుకు గాను లంచం తీసుకున్నట్లు సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభిరామారావు అంగీకరించారు. ఈ మేరకు ఆయన ఏసీబీకి నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం మేరకు తాను మొదట లంచం తీసుకునేందుకు సంకోచించినా బయటపడదని మాజీ న్యాయమూర్తి చలపతిరావు తననను ఒప్పించారని దీంతో ఐదుకోట్ల రూపాయలు తీసుకొని బెయిలు ఇచ్చేందుకు తాను అంగీకరించానని తెలిపారు. అంతముందు మరో న్యాయమూర్తి ప్రభాకరరావు పది కోట్ల ఆఫర్‌తో తాను తిరస్కరించానని తెలిపారు.