లక్ష హెక్టర్లలో దెబ్బతిన్న పంటలు

కృష్ణా: నీలం తుపాను ప్రభావంతో జిల్లాలో 1,06,169 హెక్టార్లలో వరి,పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, భారీ వర్షాల కారణంగా జిల్లా రహదారులకు రూ.132 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. వరద ఉద్థృతి తగ్గకపోవడంతో విజయవాడలో ఇంకా ముంపులోనే పాతబస్తీలోని పలు కాలనీలు, బుడమేరు పరిసర ప్రాంతాలు ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.