లగడపాటి అరెస్టుకు పోలీసుల యత్నం

విజయవాడ : సమైక్యవాదానికి చంద్రబాబు మద్దతు తెలిపాలని కనువిప్పు యాత్రకు సిద్దమైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. నేడు కృష్ణా జిల్లాలోకి ‘ వస్తున్నా… మీకోసం ‘ పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో చంద్రబాబును కలిసి వినతిపత్రం  సమర్పించాలన్న యోచనలో లగడపాటి ఉన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అనుమంచిపల్లిలోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించారు. స్థానిక కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేశారు. లగడపాటిని అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే లగడపాటి తన ఇంట్లోకి వెళ్లి పోలీసులు రాకుండా తలుపులు వేసుకున్నారు.