లడ్డు వేలంపాటలో 11 వెల116 రూపాయలకు

ధకించుకున్న ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు
ఖానాపూర్ రూరల్ 9 సెప్టెంబర్ (జనం సాక్షి): తొమ్మిది రోజులు భక్తులచే పూజలు అందుకున్న గననాధునికి శుక్రవారం ఉత్తర పూజతో శోభయ మనంగా నిమజ్జన యాత్ర సాగింది.ఈ సందర్భంగా వివిధ నగర మండపాల నిర్వాహకులు గణనాధున్ని సుందరంగా అలంకరించి నిమార్జననికి తీసుకువెళ్లారు.చివరి రోజు గణనాధుని చేతులోని లడ్డు ను వేలంవేయటం ఆనవాయితీ విద్యానగర్ గణేష్ నిర్వాహకులు నిర్వహించిన వేలంపాటలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ వ్యక్తిగత సహాయకులు గుగిల్ల సతీష్ పదకొండు వేల ఒకవంద పదహారు రూపాయలకు వేలంపాటలో ధకించుకున్నారు. ఈ సందర్భంగా విద్యానగర్ యూత్ అధ్యక్షులు పరంకుషమ్ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు కొత్త పెల్లి సురేష్,గుగిల్ల సతీష్ ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విద్యానగర్ యూత్ వేల్పుల అశోక్,గుడూరు పోశెట్టి,తుమ్మనపెల్లి సంకేత్, కౌసులర్ తొంటి శ్రీను, బుక్యా లాలూ, కరింగుల కిషన్,మడిగెల గంగధర్, కొక్కుల ప్రదీప్,కౌట మహేష్,పడల రాజ శేఖర్,పడల ప్రభాకర్, ఎనగందుల నారాయణ,యూత్ సభ్యులు పాల్గొన్నారు.