లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలు పంపిణీ..
టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 1 మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన వివిధ రకాల ఆసరా పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్ ఆదేశాల మేరకు పంపిణీ చేశారు. స్థానిక గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయికోటి సుప్రజా భాస్కర్ టేక్మాల్ ఎంపీపీ చింతా స్వప్న రవి తెరాస మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప,చేతుల మీదుగా 146 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని తాను ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాల వారందరికీ పెన్షన్ మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మరి సిద్ధయ్య, పట్నం రాములు, సలీం, మాణిక్యం, సుధాకర్,సాయిలు, గోవింద్ చారి, సత్యం, కిషోర్,రాము,బాలు,సలావోద్దీన్, సత్యనారాయణ,కృష్ణ,పెంటయ్యా, తదితరులు పాల్గొన్నారు.