లాభాల బాటలో ఖమ్మం డిసిసిబి

ఖమ్మం, జూలై 17: స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లాభాల బాటలో నడుస్తోందని బ్యాంకు అధ్యక్షులు యలమంచిలి రవికుమార్‌ అన్నారు. 2011-12 సంవత్సరానికి బ్యాంకు 1.2 కోట్ల నికర ఆదాయం ఆర్జీంచడంద్వారా తెలంగాణ జిల్లాల్లో ప్రథమ స్థానంలోకి వచ్చిందని అన్నారు. ఇందుకు సహకరించిన వారికి పేరుపేరున ధన్యవాదాలని రవికుమార్‌ తెలిపారు. సహకార సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాల పంపిణీని 50 శాతం వరకు పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.