లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

దమ్మపేట: మండలంలోని మందలపల్లి రాష్ట్రీయ రహదారిపై శుక్రవారం ఉదయం సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు లారీని ఢీకొంది. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావటంతో ప్రమాదం జరిగింది. ప్రయాణికులకు గాయాలు కాలేదు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతింది.