లాలాగూడలో బాలుని కిడ్నాప్
హైదరాబాద్: సికింద్రాబాద్ లాలాగూడలో ఓ చిన్నారి కిడ్పాప్‌నకు గురయ్యాడు. ఈ ఉదయం ఆరుబయట ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే ఇందులో ఇద్దరు చిన్నారులు వారి నుంచి తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు సమాచారమందించారు. దుండగుల చెరలో ఉన్న బాలుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.