లుగుదేశం పార్టీని ఆదరించాలి


– తెలుగుదేశం నేత మండవ వెంకటేశ్వర్లు
హుజూర్ నగర్ మార్చి 10 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ఆ పార్టీ నాయకుడు మండవ వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలో 14 ,15 ,16 ,21 వార్డులలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి ఆడపిల్లకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని కల్పించి మహిళల గౌరవాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంస్కరణలు అభివృద్ధి మూలంగానే నేడు తెలంగాణ ఆదాయ వనరుగా మారిందన్నారు. హుజూర్ నగర్ రింగ్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన కాలువ కట్ట నిర్వాసితులకు డబల్ బెడ్రూంలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్ కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్, టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోష పతి, నల్గొండ పార్లమెంటు అధికార ప్రతినిధి సోమగాని నరేందర్ గౌడ్, గరిడేపల్లి మండల పార్టీ కన్వీనర్ కీసరి నాగయ్య ముదిరాజ్, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు గుండు వెంకటేశ్వర్లు గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు మేకల వెంకటేశ్వర్లు , ఎస్కే సైదా తదితరులు పాల్గొన్నారు.