‘లోక్‌సత్తా తెలంగాణకు అనుకూలమని చెప్పాలి’

హైదరాబాద్‌: అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లోక్‌సత్తా అనుకూలమని చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కోరారు. ఈమేరకు ఆయన ఇవాళ లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ్‌ చేపట్టిన సురాజ్య ఉద్యమ శిబిరానికి చేరుకుని మాట్లాడారు. తనను ఈ దీక్షకు ఆహ్వానించినందుకు జేపీకి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్‌ 2న కేంద్రహోంశాఖ మంత్రి నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని లోక్‌సత్తా చెప్పాలని ఆయన ఆపార్టీ అధినేత జేపీకి విజ్ఞప్తి చేశారు.