వంద మంది కాంగ్రెస్ లో చేరిక.
ఫోటో రైటప్: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు.
బెల్లంపల్లి, ఆగస్టు21, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కుశ్నపల్లి, కొత్తూరు, కోణంపేట, ఖర్జి, జెండా వెంకటాపూర్, నర్వాయి పేట, చిత్తాపూర్ గ్రామాలకు చెందిన వంద మంది యువకులు ఆదివారం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన వారిని ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఒక మాజీ సర్పంచ్, ఒక ఉప సర్పంచ్, ముగ్గురు వార్డు సభ్యులు ఉన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన కాంగ్రెస్ పార్టీలో చేరారని, బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గుండ్ల సోమారం ఎంపీటీసీ దాగం రమేష్, జంగాల్ పేట ఎంపీటీసీ గొలుసుల శిరీష-మదునయ్య, నాయకులు లావుడ్య రమేష్, ఓరేం శంకర్, బిక్కయ్య, లావుడ్య బిక్య, రాజు, మదుకర్ రెడ్డి, శ్రీనివాస్, తైదల శ్రీనివాస్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.