వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క

కొత్తగూడ మార్చి 22 జనంసాక్షి:గిరిజన ఆరాధ్య దైవమైన తోలం వంశస్తుల ముసలమ్మ,ఎంచగూడెం గ్రామంలో వాసం వారి ఇలవేల్పు కొమ్మలమ్మ వనదేవతలను దర్శించుకున్న పంచాయతీ శాఖ మంత్రి ధనసరి అనసూయ( సీతక్క ) ముందుగా గుంజేడు ఆలయంలో ముసలమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆదివాసి సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క అనంతరం ఆలయ అధికారి బిక్షమా చారి తో మాట్లాడుతూ భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.అనంతరం మండలంలోని ఎంచగూడెం గ్రామంలో వెలిసినటువంటి కొమ్మలమ్మ తల్లిని దర్శించుకుని మొక్కుబడిలో భాగంగా ఆ తల్లి కి ఇష్టం ఇష్టమైన వెండి కట్టు(రింగ్ )సమర్పించిన మంత్రి సీతక్క.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పుష్పలత శ్రీనివాస్,ఎంపీపీ విజయ రూప్సింగ్,మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,జాడి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.