వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్తత

కరీంనగర్‌ జిల్లాలోని మహాముత్తారం మండలం కోనంపేట శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 1500 మంది రైతులు గుమిగూడారు. రెవెన్యూ, అటవీ భూముల సాగుపై వరంగల్‌ జిల్లా రైతులతో కరీంనగర్‌ జిల్లా రైతులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు జిల్లాల రైతులతో పోలీసులు చర్చిస్తున్నారు.