వరకట్న హంతకులకు యావజ్జీవమే సరైనది

న్యూఢిల్లీ: వరకట్నం హత్యకేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగారం విధించాలని, అంత కంటే తక్కువ శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న దాహంతో నిస్సహాయులను అతి దారుణంగా చంపేవారికి యావజ్జీవ ఖైదు సరియైనదే అని జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌,జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌లు స్పష్టం చేశారు. 1996లో రూర్కీలో జరిగిన ఇక వరకట్న హత్య కేసులో వారు ఈ మేరకు తీర్పు చెప్పారు. అడిగినంత డబ్బు  తన పుట్టింటి నుంచి తీసుకురాలేదనే కోపంతో భర్త ముఖేష్‌ తన భార్య రేణుకను సజీవ దహనం చేసి చంపాడు.ఈ దారుణంలో తమ్ముడు,తల్లి కూడా సహకరించారు. అయితే రేణుక మృతిని ఆత్మహత్మగా చిత్రీకరించడానికి ప్రయత్నించడాన్ని కోర్టు కొట్టి పారేసింది. రేణుక భర్త, అతని సోదరుడు వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి ఈ కేసులో శిక్ష విషయంలో కనికరం చూపాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.