వరద కారణంగా పలు రైళ్లు రద్దు

హైదరాబాద్‌: పలు జిల్లాల్లో వరద నీటి ఉద్థృతి కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-విశాఖ రత్నాచల్‌, గుంటూరు-విశాఖ సింహాద్రి, విశాఖ-సికింద్రాబాద్‌ జన్మభూమి, విజయవాడ-విశాఖ ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. వీటితో పాటు మచిలీపట్నం-నర్సాపురం, తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-హౌరా, చెన్నై-అసంసోల్‌, హిందూపురం-తాడే పల్లిగూడెం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపివేశారు.