వర్గీకరణ కోసం టీడీపీ పోరాడాలి: మందకృష్ణ

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ కోసం శాసనసభ, పార్లమెంట్‌లో టీడీపీ పోరాడాలని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. గతంలో ఎస్సీ  వర్గీకరణ అమలు చేస్తామని వైఎస్‌ మోసం చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే టీడీపీని ప్రజలు విశ్వసిస్తారని మందకృష్ణ వ్యాఖ్యానించారు.