వర్షాబావ పరిస్థితుల కారణంగా బియ్యం, గోధుమ ఎగుమతులకు అవరోదం తొలగింపు

న్యూఢిల్లీ: దేశంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా బియ్యం, గోధుమ ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాణిజ్య శాఖ తెలిపింది. విదేశీ వ్యాపార డైరెక్టర్‌ జనరల్‌ అనూవ్‌ పూజారీ మాట్లాడుతూ దేశంతో ఏ వ్యవసాయ ఉత్పత్తి ఎగుమతిపైనా నిషేధం విధించే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌ శర్మ, వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ కూడా ఎగుమతులకు ఎలాంటి అవరోధాలు ఉండవని ఇటీవల చెప్పారు.