వసతిగృహం విద్యార్థులకు ఉపకార వేతనాలు

ఖమ్మం, జూన్‌ 30 : సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ) వసతిగృహాల్లో చదువుకునే 9,10 తరగతి విద్యార్థులకు కేంద్రప్రభుత్వం నూతనంగా ఉపకార వేతన పథకాన్ని ప్రవేశపెట్టిందని అశ్వరావుపేట ఎస్సీ వసతిగృహ వార్డెన్‌ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 9, 10 తరగతి చదివే విద్యార్థులకు నెలకు 350 రూపాయలు, ఇంటి వద్దనే ఉండి చదువుకునే వారికి 150 రూపాయల వంతున పది నెలల పాటు ఉపకార వేతనాలు ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. వీటితో పాటు ఇతర ఖర్చులకు వెయ్యి రూపాయలు, 750 రూపాయల చొప్పున వస్తాయని అన్నారు. 9,10 తరగతి చదివే విద్యార్థులు వసతి గృహంలో చేరి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు.