వాగ్దేవిలో వార్షికోత్సవ వేడుకలు
వరంగల్ ఈస్ట్, మార్చి 17 (జనం సాక్షి)వరంగల్ నగర సమీపంలోని బొల్లికుంట వద్ద గల వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో హన్మకొండ వాగ్దేవి డిగ్రీ పిజి కళాశాలల వార్షిక రోజు ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన వరంగల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జె. ఉపేందర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతు వాగ్దేవి విద్యాసంస్థలు దక్షిణ తెలంగాణలో ప్రముఖ విద్యాసంస్థగా పేరు పొందడం అభినందనీయమని, కళాశాలలు వార్షిక రోజు చేసుకున్నందుకు వాగ్దేవి కళాశాలల యజమాన్యాననికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రముఖ గాయకులు హేమచంద్ర,ప్రముఖ హీరోయిమ్ డింపుల్ హాయతి తన ఆట, పాటలతో విద్యార్థులను ఉషారెత్తించారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి , సెకరట్రీ డా. దేవేందర్ రెడ్డి , జాయింట్-సేకటరీ. సత్యపాల్ రెడ్డి , డైరెక్టర్లు డా.వాణి దేవి ,డా.వాహిని దేవి రెడ్ క్రాస్ స్టేట్ ఈసీ మెంబర్ డా. శ్రీనివాస్ రావు , వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు డా.. శేషాచలం ,డా. శ్రీనివాస్ రెడ్డి ,డా. సంపత్ రెడ్డి , డా.హరిందర్ రెడ్డి , డా.శ్రీనివాస్ వివిధ విభాగాల అధిపతులు,అధ్యాపకులు, విద్యార్థులు పాలుగొన్నారు.