మేడారంలో సరికొత్త శకం
` వనదేవతలకు కొత్తశోభ
` నూతన గద్దెలపై కొలువుదీరిని సమ్మక్క సారలమ్మలు
` అట్టహాసంగా మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం
` ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి
` ఆలయం చుట్టూ ఆకట్టుకుంటున్న గిరిజన శిల్పాలు
మేడారం(జనంసాక్షి):మేడారంలో నూతనంగా నిర్మించిన అమ్మవారి గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. ఆదివాసీ సంస్కతి ఉట్టి పడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహా జాతరను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆలయ అభివద్ది పనుల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ప్రారంభించారు. తొలుత అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వన దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
రాతిశిలలతో అభివద్ధి
ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్ప రూపం దిద్దుకుంది. చారిత్రక కట్టడాల తరహాలో అద్భుత కట్టడం ఆవిష్కతమైంది. సమ్మక్క`సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు చరిత్రలోనే ఓ మైలు రాయిగా నిలిచిపోయేలా సర్కార్ చేపట్టింది. రాతిశిలలతో అభివద్ధి పనులకు ప్రాణం పోయగా, 4 వేల టన్నుల గ్రానైట్?పై ఆదివాసీ చరిత్ర సంస్కతి తెలియజేసేలా 7 వేల చిత్రాలను హద్యంగా చిత్రీకరించారు. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా మూడు నెలల వ్యవధిలోనే పనులను పూర్తి చేశారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, పునర్నిర్మాణ నిర్మాణ పనులు ఆదివాసీల మూలాలు జాతర చరిత్రను కళ్లకు కట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. ఆదివాసీల సంస్కతి, సంప్రదాయాలకు పెద్దపీటవేస్తూ చరిత్రను కళ్లకు కట్టే విధంగా వందల ఏళ్లు చెక్కు చెదరకుండా పనులు పూర్తి చేశారు.
గోడలపై కోయ వంశీయుల చరిత్ర
గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా ఉండేలా 46 పిల్లర్లతో 271 చదరపు విÖటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం, వత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలు చెక్కారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి ఏడు వేల చిత్రాలను ఏర్పాటు చేశారు.



