వామ్మో.. ఒమిక్రాన్‌.

share on facebook


` 30కి పైగా మ్యుటేషన్‌లతో కలవరం
` కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు
దిల్లీ,నవంబరు 28(జనంసాక్షి):అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో 30కిపైగా ఉత్పరివర్తనాలు సంభవించినట్లు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నాయి. అందుకే దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పొందగలుగుతుందన్నారు. ఈ మ్యుటేషన్లే (ఓబీబిజీబితినీనిబ) ప్రమాదకరంగా మారవచ్చని.. ఇదే జరిగితే టీకా సామర్థ్యం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌ను ఏ మేరకు ఎదుర్కొంటాయనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.‘స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొనే చాలా వ్యాక్సిన్‌లు పనిచేస్తాయి. స్పైక్‌ ప్రొటీన్‌లలో వైరస్‌ను గుర్తించినప్పుడు వాటిని ఎదుర్కొనే యాంటీబాడీలను వృద్ధి చేస్తాయి. తద్వారా మానవ కణంలోకి వైరస్‌ ప్రవేశించకుండా అవి అడ్డుకుంటాయి. కానీ, తాజా వేరియంట్‌లో స్పైక్‌ ప్రొటీన్‌లోనే దాదాపు 30కిపైగా ఉత్పరివర్తనాలు కనిపించాయి. స్పైక్‌ ప్రొటీన్‌ భాగంలో ఎక్కువ ఉత్పరివర్తనాలు సంభవిస్తే వ్యాక్సిన్‌ సమర్థత తగ్గిపోవడానికి దారితీస్తుంది’ అని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వెల్లడిరచారు. ఇలాంటి సందర్భంలో భారత్‌లో వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌లతో పాటు అన్ని టీకాల సమర్థతను క్షుణ్ణంగా పరిశీలించి అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రత, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యానికి సంబంధించి వెలుబడే సమాచారంపైనే తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఆధారపడి ఉంటాయని డాక్టర్‌ గులేరియా పేర్కొన్నారు.ఈ ఒమిక్రాన్‌ (ూఎతిఞతీనీని) వేరియంట్‌ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని.. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించకూడదని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు స్థానికంగా కొవిడ్‌ కేసులు అకస్మాత్తుగా పెరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాలని స్పష్టం చేశారు. వీటితోపాటు రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకోని వారు త్వరగా టీకా తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే పలుదేశాల్లో వెలుగు చూసిన ఈ కొత్తరకం వేరియంట్‌ మన దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వేరియంట్‌కు సంబంధించి భారత్‌లోని కొవిడ్‌ జీనోమ్‌ కన్సార్టియం ఇన్సాకోగ్‌ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తోందని వెల్లడిరచింది.ఇదిలాఉంటే, ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లతో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న ఈ ఒమిక్రాన్‌ (బీ.1.1.529) వేరియంట్‌ నవంబర్‌ 24న దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. అనంతరం బోత్సువానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాలకు విస్తరించింది. ఈ వేరియంట్‌పై సవిూక్షించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించింది. అనంతరం దీనికి ఒమిక్రాన్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.
ఒమిక్రాన్‌.. ఓ హెచ్చరిక సంకేతం : సౌమ్య స్వామినాథన్‌
భారత్‌లో తగిన కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడానికి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ఓ హెచ్చరిక సంకేతం లాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. ఆమె ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ కొత్త వేరియంట్‌ కట్టడికి పలు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా మాస్కులు ధరించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. మాస్కులను ‘జేబులో ఉన్న వ్యాక్సిన్లు’ లాంటివని ఆమె పేర్కొన్నారు. వైరస్‌ కట్టడికి ఇవి సమర్ధంగా పనిచేస్తాయని, ప్రధానంగా చూట్టూ మూసిఉన్న వాతావరణంలో ఇవి తప్పనిసరి అని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కొత్త వేరియంట్‌ కట్టడికి సశాస్త్రీయ వ్యూహాన్ని అనుసరించాలన్నారు. దీని స్వభావాన్ని గుర్తించేందుకు మరింత అధ్యయనం అవసరమని చెప్పారు.
వ్యాప్తి తీరుపై పరిశీలన : ఐసీఎంఆర్‌
కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి తీరు, దీనిపై వ్యాక్సిన్ల సమర్థత వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్త సవిూరన్‌ పాండా శనివారం తెలిపారు. ఈ కొత్త రకానికి సంబంధించి పలు ఇతర దేశాల్లో జన్యుపరమైన వైవిధ్యాలు, నిర్మాణాత్మక మార్పులు కనిపించినట్లు చెప్పారు. ఈ మార్పులు వైరస్‌ వ్యాప్తిని పెంచుతాయా? టీకాల పనితీరును ప్రభావితం చేస్తాయా? అన్నది పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. కాగా దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని చెప్పారు.
కొత్త వేరియంట్‌ అస్పష్టం : ఫౌచీ
కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దక్షిణాఫ్రికాలో అస్పష్టంగా ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ తెలిపారు. ఈమేరకు వివిధ అంశాలపై యూఎస్‌ శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని సహచరులతో చురుగ్గా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కొత్త రకానికి సంబంధించిన వాస్తవాలు, ఇది యాంటీబాడీలను ఏమారుస్తుందా? తదితర అంశాలపై వారితో సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘దక్షిణాఫ్రికాలో ఇది కచ్చితంగా కొత్త వేరియంట్‌. కొన్ని ఉత్పరివర్తనాలు ఉండటంతో.. ప్రత్యేకించి దీని వ్యాప్తి, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని ఆనుపానులకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది’’ అని ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ఈ కొత్త రకం ఉనికి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సంకేతాలేవిూ లేవని.. అయితే ఎప్పుడు ఏదైనా జరగొచ్చని అన్నారు
ఒమిక్రాన్‌ వేరియంట్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆఫ్రికాలో ఆ వేరియంట్‌ ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆరోగ్యశాఖల అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. భారత్‌లో కూడా ప్రధాని నరేంద్రమోదీ నిన్న ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై కరోనా కొత్త వేరియంట్‌ గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్‌పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖలు రాశారు.కొత్త వేరియంట్‌ దేశంలో ప్రవేశించే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖల్లో రాజేశ్‌ భూషణ్‌ కోరారు. కొవిడ్‌ నిబంధనలన కఠినతరం చేయాలని, కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బయటపడితే ఆ వైరస్‌ సోకిన వారిపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని పేర్కొన్నారు.
ఫ్లైట్లను తక్షణమే నిలిపేయండి.. ప్రధానికి ఢల్లీి సీఎం లేఖ
ఆఫ్రికాలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ విజృంభణ నేపథ్యంలో ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దేశంలో ప్రవేశించకముందే దాని ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి విమానాల రాకపోకలను నిషేధించాలని ఆ లేఖలో కోరారు. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా పరిస్థితి చేయిదాటిపోయి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.‘గత ఏడాదిన్నర కాలంగా మన దేశం కరోనా మహమ్మారితో పోరాడిరది. లక్షలాది మంది కొవిడ్‌ వారియర్స్‌ నిస్వార్థ సేవతో ప్రస్తుతం మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్నాం. ఇప్పుడు ఒమిక్రాన్‌ అనే కొత్త రకం కరోనా వేరియంట్‌ కలకలం రేపుతున్నది. ప్రమాదకరంగా విస్తరిస్తున్న దాన్ని దేశంలోకి రాకుండా నిలువరించడానికి తక్షణమే చర్యలు చేపట్టాలి. ఒమిక్రాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు విమానాల రాకపోకలను నిషేధించాలి. లేదంటే ఒమిక్రాన్‌ సోకిన ఒక్క వ్యక్తి దేశంలోకి వచ్చినా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది’ అని కేజ్రివాల్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Other News

Comments are closed.