వామ్మో గిదేంది!

కాంగ్రెస్సే కాదు.. సమాజ్‌వాదీ కూడా పాక్‌సానుభూతి పార్టీయేనట!
` ప్రధాని సరికొత్త ఆరోపణ
ప్రధాని మోదీకాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. వారు పాకిస్థాన్‌ సానుభూతిపరులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (ఖఓ ఓనీటతి) ఆరోపించారు. ఆ రెండు పార్టీలు పాక్‌కు సానుభూతిపరులు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.2017లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసిన ఈ రెండు పార్టీలు (కాంగ్రెస్‌, ఎస్పీ) ఓటమి చవిచూశాయని.. ప్రస్తుతం మళ్లీ అవి కలిసి ప్రచారం చేయడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రధాని ఎద్దేవా చేశారు. ‘‘ఒకప్పుడు ఉగ్రవాదం పేరుతో మనల్ని బెదిరించినవారు ప్రస్తుతం ఆహార ధాన్యాల కోసం అల్లాడుతున్నారు. పాకిస్థాన్‌ పని అయిపోయింది. కానీ, ఆ దేశ సానుభూతిపరులైన ఎస్పీ, కాంగ్రెస్‌లు మాత్రం దేశాన్ని భయపెట్టే పనిలో బిజీగా ఉన్నాయి’’ అని మోదీ ఆరోపించారు.ఇది బలహీన ప్రభుత్వం కాదు.. మోదీ సర్కార్‌‘‘పాక్‌ వద్ద అణు బాంబులున్నాయని మనం భయపడాలని వారు అంటున్నారు. ఈ 56 అంగుళాల ఛాతీ (మోదీని ఉద్దేశిస్తూ) గురించి వారికి తెలియదా? ఇది వారి బలహీన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు.. బలమైన మోదీ సర్కార్‌. మనల్ని బెదిరించాలని ప్రయత్నించే వారిని భారత్‌ వదిలిపెట్టదు. వారి దేశంలోకి వెళ్లి మరీ వాళ్ల అంతు చూసింది’’ ప్రధాని మోదీ పేర్కొన్నారు.