వారం రోజుల్లో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్కైప్‌ వీడియో కాలింగ్‌ విధానం

కరీంనగర్‌్‌, ఆగస్ట్‌ 1(జనంసాక్షి):జిల్లాలోని 51 కసూర్బా గాంధీ పాఠశాలల్లో స్కైప్‌ వీడియో కాలింగ్‌ సిస్టమ్‌ ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. బుధ వారం సాయంత్రం కలెక్టర్‌లోని ఆమె చాంబర్‌లో  స్కైబ్‌ వీడియో కాలింగ్‌ పనితీరును పరిశీలించా రు. ఈ సంధ్బరంగా కల్టెర్‌ స్కైప్‌ వీడియో కాలింగ్‌ ద్వారా రామగుడం, ధర్మారాం, చొప్పదండి, సుల్తానాబాద్‌, కస్తూరిబా గాంధీ ద్వారా బాలికల పాఠశాల స్పెషల్‌ ఆఫిసర్లు , విద్యార్ధినీలతో కలెక్టర్‌ మాట్లాడారు. సుల్తానాబాద్‌ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని స్రవంతి అనే విద్యార్ధిని మాట్లాడగా భోజనంలో ఏమి తిన్నారు? మి క్లాస్‌ లో అందరికీ ఆరోగ్యం బాగుం దా క్లాస్‌లో ఎంత మంది ఉన్నారని కలెక్టర్‌ ప్రశ్నిం చారు. త్రాగునీటి పైపు లైన్‌ లీకేజీలు ఏమైనా ఉన్నవా, శైలజా మేడం ఏ సబ్జెక్టు బోదిసుంది, ఇ ష్టమైన సబెక్ట్‌ ఏది అని అడుగగా వెంటనే స్రవంతి నేరుగా కల్టెర్‌ తో మాట్లాడుతూ భోజనంలో పప్పు టమాట, క్యాబేజి అని మా క్లాస్‌లో అందరు ఆర్యొ గంగా ఉన్నారని, 29 మంది ఉన్నామని ,బాత్‌ రూంలు శుభ్రంగా ఉన్నాయని, లైట్ల వెలుగుచు న్నట్లు శైలాజా మెడమ్‌ లెక్కలు బొదిస్తారని ,నాకు ఇష్టమైన సబెక్టు ఇంగ్లీషు అని తెలిపారు. కలెక్టర్‌ వెంటనే విద్యార్తిని అబినందిస్తూ సమస్యలుంటే నే రుగా స్కైప్‌ వీడియో కాలింగ్‌ ద్వారా తమకు తెలు పాలని సూచించారు. ఇంత వరకు ఆరు పాఠశా లలో స్కైబ్‌ స్టిసమ్‌ అమర్చారారని అన్నారు. జిల్లా కేంద్ర నుండి అధికారుల ప్రతి రోజు సాయంత్రం 5-6 గంటల మధ్యలో స్కైప్‌ వీడియె కాలింగ్‌ ద్వారా విద్యార్థుల హాజరు భోజన ఏర్పాట్లు ,విద్యార్థుల ఆరొగ్య సమస్యలు ,ఉపాద్యాయుల హాజరు అడిగి తెలిసి కొవాలని సూచించారు.